అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం

అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం

సున్నా వడ్డీపై పథకంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సభను తప్పుదోవ పట్టించారంటూ సీఎం జగన్ పై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన టీడీపీ చర్చకు పట్టుబట్టింది. అయితే మొదట ఇందుకు అంగీకరించలేదు స్పీకర్ తమ్మినేని సీతారాం. కాసేపు ఇదే అంశంపై వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. సున్న వడ్డీపై చర్చకు అనుమతించాలని కోరారు. నిజానిజాలేంటో ప్రజలకు తెలియాలని.. ప్రభుత్వం కూడా పూర్తి డేటాతో చర్చకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. రైతులకు వడ్డీలేని రుణాల కింద 5 శాతం ఇచ్చి గొప్పగా చేశామంటున్నారని ఎద్దేవా చేశారు.ఆ తర్వాత కూడా అధికార, విపక్ష సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది.

Tags

Next Story