ఆ పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి ఎంతకి అమ్మేశారు : టీడీపీ

ఆ పోర్టును తెలంగాణ ప్రభుత్వానికి ఎంతకి అమ్మేశారు : టీడీపీ

అన్న క్యాంటీన్ల మూసివేత, మచిలీపట్నం పోర్టు ఇష్యూ, పోలవరం పనుల నిలిపివేత, రివర్స్ టెండరింగ్..ఇలా వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రెవెన్యూ లోటులోనూ జాగ్రత్తగా రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు వేసుకుంటూ వచ్చామని గుర్తు చేస్తున్నారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం తీరుతో ఏపీలో అభివృద్ధి కుంగుబాటులో ఉంటోందని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే పోర్ట్‌ పనుల యంత్రాలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. తెలంగాణ ప్రభుత్వానికి పోర్టును ఎంతకి అమ్మేశారని ప్రశ్నించారాయన. జగన్ సర్కార్‌ క్విడ్‌ ప్రోకోకు బందర్ పోర్ట్‌ ఇచ్చేసిందని ఆరోపించారు. సెర్బియా పోలీసుల అరెస్టులపై జగన్‌ ఎందుకు ట్వీట్‌ చేయడంలేదని అడిగారు దేవినేని ఉమ.

జగన్, వైఎస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలేనని విమర్శించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఇద్దరూ కాపులను ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై వైసీపీ ప్రభుత్వం దృష్టిసారించడం లేదన్నారు. కాపుల నోటిదగ్గర కూడు తీసేస్తుంటే వైసీపీలో ఉన్న కాపు నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాపుల మీద కక్ష కట్టినట్లుగా జగన్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కళా వెంకట్రావు.

చంద్రబాబు ఐదేళ్ల పాటు నిర్మాణాలు చేసుకుంటూ వస్తే జగన్ ప్రభుత్వం మాత్రం వాటిని కూల్చటమే పనిగా నిర్దేశించుకుందని ఫైర్ అయ్యారు గణబాబు అన్నారు. చివరికి ఇసుక కొరత సృష్టించి నిర్మాణ రంగాన్ని దివాళా తీయించారని ఆరోపించారు.

టీడీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఎదోవిధంగా రద్దు చేయటమే జగన్ లక్ష్యమని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. చివరికి పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్ తోనూ రాజకీయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story