వైసీపీ ప్రభుత్వం పేదవాడి కడుపుకొడుతోంది: టీడీపీ నేతలు

X
అన్న క్యాంటీన్‌ల మూసివేతకు నిరసనగా ఏపీలో టీడీపీ నేతలు ధర్నాలు చేపడుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అన్న క్యాంటీన్ ఎదుట టీడీపీ నేతలు నిరసనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి నుంచి అన్న క్యాంటీన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అన్న క్యాంటీన్లు మూసి పేదవాడి కడుపుకొట్టడం దారుణమని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ నిరసనకార్యక్రమంలో తాడిపత్రి టీడీపీ నేతలు జిలాన్, అయుబ్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
