జగన్ ప్రభుత్వంపై పారిశ్రామికవేత్త సంచలన ట్వీట్

జగన్ ప్రభుత్వంపై ప్రముఖ కర్నాటక పారిశ్రామిక వేత్త మోహన్‌దాస్ పాయ్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతోందని అన్నారు. పీపీఏలపై సమీక్ష జరపడంపై పాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జపాన్ కంపెనీలు లేఖరాసిన తర్వాత అయిన కళ్లు తెరవాలి కదా అంటూ ప్రశ్నించారు మోహన్ దాస్..
సింగపూర్ ఇప్పటికే అమరావతిలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిందని.. అలాంటి వారి నమ్మకాన్ని వమ్ముచేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మోహన్ దాస్ పాయ్. ఇలా చేస్తే ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయని అన్నారు. ఇండస్ట్రీని దెబ్బతీసి, ఏపీ భవిష్యత్తుని నాశనం చేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మోహన్ దాస్..
ఈ ట్వీట్స్‌ను నేరుగా జగన్‌కే ట్యాగ్ చేశారు మోహన్‌దాస్ పాయ్.. మే నెలాఖరులో కూడా ఓసారి ఆయన జగన్‌కు లేఖ రాశారు. మోహన్ దాస్ పాయ్ ఆర్యన్ క్యాపిటల్ అధినేత, అక్షయపాత్ర సహవ్యవస్థాపకుడు. కర్నాటకలోని పలుకంపెనీల్లో కూడా మోహన్‌దాస్ డైరెక్టర్‌గా ఉన్నారు...
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com