కుమారుడికి ఎయిర్‌పోర్ట్‌లో సెండాఫ్‌ ఇచ్చి వస్తుండగా..

కుమారుడికి ఎయిర్‌పోర్ట్‌లో సెండాఫ్‌ ఇచ్చి వస్తుండగా..

విదేశాలకు వెళుతున్న కుమారుడికి ఎయిర్‌పోర్ట్‌లో సెండాఫ్‌ ఇచ్చి తిరుగుప్రయాణమైన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. జనగామ జిల్లా దేవర్పుల వద్ద పెనుగొండ గణేష్‌ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. కారు, మినీ లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతులంతా మహబూబాబాద్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదస్థలంలోనే ముగ్గురు చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీలత అనే మహిళ చనిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story