కిలో ఉల్లి రూ.25లకే.. సర్కారు నిర్ణయం..

కిలో ఉల్లి రూ.25లకే.. సర్కారు నిర్ణయం..
X

కూరగాయలకంటే రేటు ఎక్కువ పెరిగి 15 రోజులుగా కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ఉల్లిపాయలు.. హైదరాబాద్‌లో అయితే కిలో రూ.60ల నుంచి ఆపై మాటే. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఏపీ ప్రజలకు కిలో రూ.25లకే ఉల్లిని అందిస్తామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. మహారాష్ట్ర నుంచి 300ల టన్నుల ఉల్లిని కొనుగోలు చేశామని ఆయన అన్నారు. వీటిని రైతు బజార్‌లో 25 రూపాయలకే అందిస్తామని అంటున్నారు. ఉల్లిని ఎక్కువగా సాగుచేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఉల్లి సరఫరా తగ్గింది. రేటు అమాంతం పెరిగింది. అయితే ఉల్లి ధరలు పెరిగి ఒకపక్క ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా ఉల్లి పంటకు సరైన మద్దతు ధర లభించక నష్టపోయామని.. ఇప్పుడు పెరిగిన ధరలు సంతోషాన్నిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story