ప్రాణం తీసిన సెల్ఫీ.. నలుగురు విద్యార్ధులు..

సెల్ఫీ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారనే వార్తలు వినిపిస్తున్నా మళ్లీ అదే పని చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జలాశయాలు, కొండల అంచున నిలబడి తీసుకునే సెల్ఫీ మరీ డేంజర్ అని తెలిసి కూడా వారి చర్యలు మానట్లేదు. సరదగా సాగాల్సిన ట్రిప్ విషాదాంతమవుతుంది సెల్ఫీల కారణంగా. తమిళనాడు కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై సమీప పాంబారు జలాశయం చూసేందుకు ఆదివారం జనం తండోప తండాలుగా తరలి వచ్చారు. అక్కడి సమీపంలోని ఒడ్డపట్టి గ్రామానికి చెందిన సంతోష్ (14), స్నేహ (19), వినోద (18), నివేద (20) అనే నలుగురు విద్యార్థులు జలాశయం చూసేందుకు వెళ్లారు. డ్యాం దగ్గర సెల్ఫీ తీసుకుంటుండగా అదుపుతప్పి గట్టుపై నుంచి నలుగురు ఒకేసారి నీటిలో పడిపోయారు. నీళ్లలో పడిపోయిన వారిని చూసి స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మరణించిన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com