డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. 20 అడుగులు ఎత్తుకు ఎగిరి పొలంలో పడిన..

డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. 20 అడుగులు ఎత్తుకు ఎగిరి పొలంలో పడిన..

షాద్‌నగర్‌ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి అనంతపురం బయలుదేరిన మారుతి ఎర్టిగా కారు.. మరో కారును ఓవర్‌ టేక్‌ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొడుతూ.. రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే చనిపోగా.. మరో నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ దుర్ఘటనలో ఓ యువకుడు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం సమయంలో కారులో 8 మంది యువకులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడి మృతదేహం.. 20 అడుగులు ఎత్తుకు ఎగిరి పొలంలో పడింది. ఈ మార్గంలో భారీ ట్రాఫిక్‌జామ్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story