అంబులెన్స్‌ను ఢీ కొన్న వ్యాన్

అంబులెన్స్‌ను ఢీ కొన్న వ్యాన్

ACCIDENT

సిద్దిపేట పట్టణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌ను.. డీసీఎం వ్యాన్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మ‌ృతి చెందారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అల్వాల్‌కు చెందిన జ్యోతి భర్త రవి గత రాత్రి గుండెపోటుతో మరణించారు. భర్త మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌లో స్వస్థలమైన హుస్నాబాద్‌ బయలుదేరారు. సిద్దిపేట సమీపంలోని పొన్నాలలో రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద అతివేగంతో వచ్చిన డీసీఎం వ్యాన్‌ అదుపుతప్పి.. అంబులెన్స్‌ను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్‌లో గాయపడ్డవారిని సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story