దీక్షకు సిద్ధమవుతోన్న నారా లోకేష్

దీక్షకు సిద్ధమవుతోన్న నారా లోకేష్
X

lokesh

ఏపీలో ఇసుక కొరతపై పోరాటాన్ని టీడీపీ మరింత ఉధృతం చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ కార్యదర్శి, నారా లోకేష్ బుధవారం దీక్షకు దిగుతున్నారు. ఏపీలో ఇసుక కొరతకు నిరసగా దీక్ష చేపట్టాలని ఆయన నిర్ణయించారు.

ఇంతలా ఇసుక కొరత రావడానికి ఏపీ ప్రభుత్వ తీరే కారణమని టీడీపీ భావిస్తోంది. ఇసుక విధానంపై జగన్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే టీడీపీ పోరాడుతోంది. దీనిలో భాగంగా బుధవారం గుంటూరులో కలెక్టరేట్ ఎదురుగా నారా లోకేష్ నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నారా లోకేష్ దీక్ష చేయనున్నారు. దీంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు గుంటూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Tags

Next Story