కన్న వారినే హతమార్చి..

కన్న వారినే హతమార్చి..
X

kasayi-koduku

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులనే హత్యచేసి పరారయ్యాడు కసాయి కొడుకు. రూరల్ మండల్ కడియద్ద గ్రామంలో ఈ ఘోరం జరిగింది. జాలవర్తి రమేష్ అనే యువకుడి మానసిక స్థితి బాగాలేదు. దీంతో కాపురం చేయలేక భార్య కూడా అతన్ని వదిలేసింది. తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున తండ్రి నాగేశ్వరరావు, తల్లి మార్తమ్మలు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఇనుపరాడ్డుతో వారిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో వారిద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు. చుట్టుపక్కలవారు అక్కడకు చేరుకునేసరికి నిందితుడు పరారయ్యాడు. తాజా ఘటనతో గ్రామంలో విషాదం నిండింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

Tags

Next Story