ఇసుక కొరత కార్మికుల ప్రాణాలు తీస్తుంది: సీపీఐ రామకృష్ణ

ఇసుక కొరత కార్మికుల ప్రాణాలు తీస్తుంది: సీపీఐ రామకృష్ణ
X

cpi

ఏపీలో ఇసుక కొరత ప్రాణాలు తీస్తోందని సీపీఐ నేతలు విమర్శించారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఐదుగురు భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆ పార్టీ నేత రామకృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా గోరంట్లలో మరణించిన భవన కార్మికుడు వెంకటేశ్వర్లు కుటుంబాన్ని సీపీఐ నేతలు పరామర్శించారు. కుటుంబాన్ని పోషించలేక.. ప్రాణాలు తీసుకున్న కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.

Tags

Next Story