అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత

అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
X

JC

అనంతపురం జిల్లా బుక్కరాయ మండలంలోని వెంకటాపురం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల టీడీపీకి చెందిన నాగరాజు అనే వ్యక్తి ఇంటికి అడ్డంగా వైసీపీ నేతలు రాళ్లను పాతారు. దీనిపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు మాజీ ఎంపీ జేసీ, కేఈ ప్రభాకర్‌, ఎమ్మెల్సీ బి.టి నాయుడు ఇతర నేతలు వెంకటాపురం వెళ్లేందుకు బయలు దేరారు. టీడీపీ నేతలు వెంటపురంలో అడుగుపెడుతుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. కారులోంచి దిగకముందే వారిని పోలీసులు అడ్డగించడంతో టీడీపీ నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో మాజీ ఎంపీ జేసీ సహా, కేఈ ప్రభాకర్‌ ఇతర నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags

Next Story