బంతి వంశీ కోర్టులో ఉంది: కేశినేని నాని

బంతి వంశీ కోర్టులో ఉంది: కేశినేని నాని
X

naniii

పార్టీని వీడుతున్న వల్లభనేని వంశీకి చెప్పాల్సింది చెప్పామని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. బంతి ఇప్పుడు వంశీ కోర్టులో ఉందన్నారు. రాజకీయంగా రాటుదేలాలంటే ఒత్తిళ్లు సహజమని కేశినేని నాని అన్నారు. వంశీకి తెలుగుదేశం ఎంత అవసరమో పార్టీకి వంశీ అంతే అసరమన్నారు.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సంప్రదింపులు జరిపి.. వంశీని తన నిర్ణయం వెనక్కు తీసుకునేలా చేయాలని టీడీపీ అధినేత.. కేశినేని నానికి చెప్పారు. అయితే, వంశీతో మాట్లాడిన నాని.. ఈ మేరకు స్పందించారు.

Tags

Next Story