పాకిస్థాన్‌లో రైలు ప్రమాదం.. 62కి చేరుకున్న మృతుల సంఖ్య

పాకిస్థాన్‌లో రైలు ప్రమాదం.. 62కి చేరుకున్న మృతుల సంఖ్య

train-accident

పాకిస్థాన్‌లో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరింగింది. లాహోర్-కరాచీ మధ్య నడిచే తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ రైల్లోని గ్యాస్ సిలెండర్ పేలి మంటలంటుకున్నాయి. దీంతో మూడు భోగీలు దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో కనీసం 62 మంది సజీవదహనం కాగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

లాహోర్ నుంచి కరాచీకి రైల్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్స్‌కు తరలించారు. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నాలుగు నెలల వ్యవధిలో పాక్‌లో చోటుచేసుకున్న రెండో అతిపెద్ద రైలు ప్రమాదం ఇది. ఈ ఏడాది జులై 11న రైల్వే స్టేషన్‌లో ఓ ట్రాక్‌పై నిలిపి ఉంచిన గూడ్స్ రైలుని.. ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో 30 మంది దుర్మరణం పాలవగా.. 80 మంది వరకు గాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story