హస్తినకు బయలుదేరిన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆర్టీసీ పరిణామాల గురించి చర్చించేందుకే ఆయన హస్తిన వెళ్లారు. కార్మికుల సమ్మె దాదాపు నెల రోజులకు చేరిన నేపథ్యంలో.. తాజా పరిస్థితులపై రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షాను కూడా లక్ష్మణ్ కలవనున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెపై నివేదికలు తెప్పించుకుంటున్న కేంద్రం.. ఈ అంశంపై పార్టీ నేతలతో కూడా మాట్లాడనుంది. ఎంపీ బండి సంజయ్ విషయంలో పోలీసుల ఓవరాక్షన్‌పై కూడా బీజేపీ పెద్దలు ఆరా తీస్తునట్టు సమాచారం.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు చేస్తున్న సమ్మె 29వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నప్పటికీ సంధి కురదటం లేదు. అటు ప్రభుత్వంగానీ, ఇటు కార్మికులు గానీ.. మెట్టు దిగకపోవటంతో రోజు రోజుకి సమ్మె ఉద్రితం అవుతోంది. సమ్మెల్లో పాల్గొంటున్న ఆదాయవనరులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇలా పలువురు ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో లక్ష్మణ్ ఢిల్లీ పయనమవ్వటం ప్రాదాన్యత సంతరించుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com