ముగిసిన సర్కార్ డెడ్‌లైన్..

ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజు కొనసాగుతోంది. ఐతే.. సర్కార్ డెడ్‌లైన్ ముగిసినా విధుల్లో చేరేందుకు పెద్ద సంఖ్యలో కార్మికులు రాలేదు. విధుల్లో చేరుతూ సమ్మతి పత్రాలు ఇచ్చింది ఒక్కశాతంలోపే ఉంది. అటు.. 400 మందికిపైగా విధుల్లో చేరేందుకు లేఖలు ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలని ఆర్టీసీ యూనియన్లు నిర్ణయించాయి. బుధవారం డిపోల ముందు ఆందోళనలకు జేఏసీ పిలుపునిచ్చింది. ఢిల్లీ స్థాయిలోనూ ఆందోళనలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం హైకోర్టు తీర్పు తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకోనుంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 8 మందే విధుల్లో చేరారు. ఖమ్మం డివిజన్‌లో 7, కొత్తగూడెం డివిజన్‌లో 5, నిజామాబాద్‌లో 5, నల్గోండ రీజియన్ పరిధిలో 22 మంది, ఉమ్మడి కరీంనగర్‌లో 23 మంది విధుల్లో చేరారు. డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు గడువు ముగిసినందున కార్మికులు డిపోల్లోకి రాకుండా ఆంక్షలు విధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com