ఏపీ సీఎం, గవర్నర్‌తో సమావేశమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

ఏపీ సీఎం, గవర్నర్‌తో సమావేశమైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
X

MI

కేంద్ర ఇంధన వనరుల, రసాయనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఏపీలో పర్యటిస్తున్నారు. గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ను కేంద్ర మంత్రి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్‌భవన్‌ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. గవర్నర్‌తో వివిధ అంశాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర చర్చించినట్టు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర మంత్రిని గవర్నర్ కోరినట్టు తెలుస్తోంది.

మరోవైపు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. ఏపీ సీఎం జగన్‌ తో సెక్రటేరియట్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో కడప ఉక్కు ఫ్యాక్టరీతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం.

Tags

Next Story