దీక్షకు సిద్ధమవుతోన్న చంద్రబాబు

దీక్షకు సిద్ధమవుతోన్న చంద్రబాబు
X

cbn

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న విజయవాడ ధర్నాచౌక్ వేదికగా 12 గంటలపాటు దీక్షకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఇసుక సమస్యపై రౌండ్ రేబుల్ సమావేశం నిర్వహించిన టీడీపీ.. ఇతర రాజకీయ పార్టీలను కూడా భాగస్వాములను చేస్తోంది. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో ధర్నాచౌక్ ప్రాంతాన్ని టీడీపీ నేతలు పరిశీలించారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతారంటున్నారు టీడీపీ నాయకులు. చంద్రబాబు దీక్ష నేపథ్యంలో ప్రత్యేక సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు.

Tags

Next Story