విమర్శలు లెక్క చేయను: సీఎం జగన్

విమర్శలు లెక్క చేయను: సీఎం జగన్
X

CM-YS-JAGAN_2

చరిత్రను మార్చే దిశగా తొలి అడుగు వేస్తున్నామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒంగోలులో మనబడి-నాడునేడు కార్యక్రమం ప్రారంభించారు. 45 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారాయన. పేదరికాన్ని రూపుమాపే శక్తి చదువుకే ఉందన్నారు. కొందరు పెద్ద మనుషుల పిల్లలు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారని.. కొందరు బాగుపడితే సమాజం మారదన్నారు. ఈ విషయంలో తనపై విమర్శలను లెక్కచేయనని జగన్ అన్నారు.

తెలుగు నుంచి ఇంగ్లిష్‌ మీడియంలోకి మారడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తప్పవన్నారు సీఎం జగన్. వారి కోసం బ్రిడ్జి కోర్సులు, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యాశాఖకు బడ్జెట్‌ పెంచుతామని హామీ ఇచ్చారు. జనవరి 9 నుంచి అమ్మఒడి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్, హాస్టల్‌ ఛార్జీలు చెల్లిస్తామని చెప్పారు.

Tags

Next Story