మరో ఆర్టీసీ కార్యకర్తకు గుండెపోటు

మరో ఆర్టీసీ కార్యకర్తకు గుండెపోటు
X

nlg

TSRTC కార్మికుల సమ్మె 41వ రోజు కొనసాగుతోంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు బలవన్మరణాలకు పాల్పడుతుండగా మరికొందరు తీవ్ర ఉద్వేగానికి లోనై గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా నిడమనూరు మండలం గౌండ్లగూడెంకు చెందిన చర్క రమేష్‌ గౌడ్‌ అనే డ్రైవర్‌కు హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ఆయనను మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రమేష్‌కు చికిత్స అందిస్తున్నారు.

Tags

Next Story