వైసీపీ వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్

వైసీపీ వేధింపులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్
X

nara-lokesh

వైసీపీ నేతల వేధింపులతో నెల్లూరు జిల్లా దగదర్తిలో ఆత్మహత్య చేసుకున్న గండికోట కార్తీక్‌ కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. అంతకుముందు కావలి ముద్దురుపాడు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత కార్తీక్‌ ఇంటికి లోకేష్‌ చేరుకున్నారు. లోకేష్‌ను చూసిన కార్తీక్‌ కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతం అయ్యారు. వారిని లోకేష్‌ ఓదార్చుతూ మనోధైర్యం చెప్పారు.

కార్తీక్ జీవనాధారమైన హోటల్‌ను పగలగొట్టి ఇబ్బందులకు గురిచేసిన పరిస్థితుల గురించి స్థానిక నాయకులతో లోకేష్‌ మాట్లాడారు. వైసీపీ నేతల తీరుపై లోకేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Tags

Next Story