పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
X

గుంటూరు జిల్లా రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌లో రామిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు కోటిరెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. అర్ధరాత్రి పోలీస్‌స్టేష్‌లోని బాత్రూమ్‌లో డెటాల్‌ తాగాడు. వెంటనే ఆయన్ను నర్సరావు పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కోటిరెడ్డిని తాము విచారణ కోసం మాత్రమే స్టేషన్‌కు పిలిచామని పోలీసులు చెప్తున్నారు.

కోటిరెడ్డిని వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. నర్సరావుపేటకు చెందిన కొందరు వైసీపీ నాయకులు తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు. కోటిరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పోలీసులు కూడా బాధ్యత వహించాలని టీడీపీ నేతలు అంటున్నారు.

Tags

Next Story