బార్ల సంఖ్య భారీగా తగ్గించనున్న ఏపీ ప్రభుత్వం


ఏపీలో మద్యపాన నిషేదంలో భాగంగా బార్ల సంఖ్య భారీగా తగ్గించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మద్యపాన నిషేదంపై ఎక్సైజ్ శాఖ మంత్రి, అధికారులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం నిర్ణయించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై పలు సూచనలు చేశారు.
రాష్ట్రంలో మొత్తం 50 శాతం బార్లు మూసేయాలని సీఎం జగన్ సూచించారని.. కానీ అధికారుల సూచనతో ప్రస్తుతం 40 శాతం బార్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి. జనవరి నెల 1వ తేదీ నుండి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు నారాయణ స్వామి చెప్పారు. బార్లు సరఫరా చేసే మద్యం ధరలను కూడా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
మద్యం కల్తీ చేసినా, స్మగ్లింగ్ చేసినా, నాటు సారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని కూడా నారాయణస్వామి హెచ్చరించారు. త్వరలో ఇందుకు సంబంధించిన చట్టాన్ని కూడా తీసుకొనిరాబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం బార్లను తీసివేసి కొత్త బార్లకు లాటరీ పద్దతి ద్వారా లైసెన్స్ లు ఇచ్చేలా చర్యలు తీసుకోబోతున్నామన్నారు మంత్రి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

