22 Nov 2019 10:11 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / పింక్‌ బాల్ టెస్ట్:...

పింక్‌ బాల్ టెస్ట్: విజృంభిస్తున్న భారత బౌలర్లు

పింక్‌ బాల్ టెస్ట్: విజృంభిస్తున్న భారత బౌలర్లు
X

pink

సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన పింక్‌ టెస్టులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న తొలి డే అండ్ నైట్‌ టెస్టులో భారత పేస్‌ బౌలర్లు విజృంభిస్తున్నారు. ఉమేష్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, మహమద్‌ షమి ముగ్గురు పోటీ పడి మరి బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నారు. దీంతో టాస్‌ నెగ్గిన పర్యాటక జట్టు 100 పరుగులు చేయడానికే ఆపసోపాలు పడుతోంది. ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ డకౌట్లుగా వెనుదిరిగారు. ఓపెనర్‌ ఇస్లామ్‌, లిటన్‌ దాస్‌ తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్‌ అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం అయ్యారు. దీంతో 60 పరుగుల దగ్గరే ఆరు వికెట్లు కోల్పోయి బంగ్లా పీకల్లోతు ఇబ్బందుల్లో పడింది.

మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నా భారత్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. క్రికెట్ చరిత్రలో టీమిండియా ప్రస్తుతం తొలి డే నైట్ టెస్టు ఆడుతోంది. తొలిసారిగా పింక్ బాల్ ప్రవేశపెట్టిన ఘనత కూడా భారత్‌ సొంతమైంది.

ప్రపంచం మొత్తం ఈ టెస్టు ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా మ్యాచ్‌ చూస్తున్నారు. డేనైట్‌ టెస్టు కోసం సాధారణంగా రెడ్‌ బాల్స్‌ వాడతారు. కానీ ఇప్పుడు పింక్‌ బాల్‌ను వాడుతున్నారు. ఇప్పటికే SG బాల్ వాడుతున్నారు. ప్రస్తుత టీమిండియా సభ్యుల్లో కొంతమందికి పింక్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడిన అనుభవం ఉంది. కానీ సారథి విరాట్‌ కోహ్లి, వైఎస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే, ఉమేశ్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లు తొలిసారి పింక్‌ బాల్‌తో ఆడనుండటం విశేషం.

Next Story