వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి రెండవ విడత నిధులు విడుదల

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి రెండవ విడత నిధులు విడుదల
X

nani

వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర రెండవ విడత నిధులను రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 2 లక్షల 36 వేల మందికి లబ్ధి కలుగుతుందని మంత్రి తెలిపారు. 236 కోట్ల రూపాయల మేర లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించామన్నారు. రెండో విడతలో 63 కోట్లు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు సాయం అందించి.. వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతోందని మంత్రి పేర్ని నాని చెప్పారు.

Tags

Next Story