హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య

హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ దారుణ హత్య

హైదరాబాద్ శివారు షాద్‌నగర్‌లో ఓ వెటర్నరీ డాక్టర్ దారుణ హత్యకు గురైంది. బుధవారం రాత్రి షాద్‌నగర్ నుంచి మాదాపూర్‌ వస్తుండగా మార్గ మధ్యలో డాక్టర్ ప్రియాంకారెడ్డి స్కూటీ పాడైంది. దీంతో.. టెన్షన్ పడుతూ ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. ఆ సమయంలో రోడ్డుపై పెద్దగా వాహనాల రాకపోకలు లేకపోవడం, కొందరు లారీ డ్రైవర్లు అక్కడ ఉండడంతో తనకు భయంగా ఉందని చెప్పింది. ఐతే ఆ తర్వాత ఆమె ఆచూకీ తెలియలేదు. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం చటాన్‌పల్లి శివార్లలో జాతీయ రహదారి కింద అడర్‌పాస్‌ వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఓ మృత దేహాన్ని గుర్తించారు పోలీసులు. ప్రియాంక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు గుర్తుపట్టారు. హత్యకు గురైంది తమ కూతురేనని తెలిసి షాక్‌కి గురయ్యారు.

నవాబ్‌పేట మండలంలోని కొల్లూరులో ప్రియాంక వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తోంది. ఆమె కుటుంబం శంషాబాద్‌లోనే నివాసం ఉంటుంది. బుధవారం రాత్రి స్కూటీ పంక్చర్ అవడంతో దాన్ని దారిలోనే వదిలిసి ఇంటికి వచ్చేయాలని ప్రియాంక సోదరి సూచించింది. రేపు మళ్లీ వెళ్లడానికి కుదరదు కాబట్టి పంక్చర్ వేయించుకుని వస్తానంది. కాసేపటి తర్వాత నుంచి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే.. విషాదకరంగా ఆమె దుండగుల చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టించింది.

డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య విషయాన్ని శంషాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఏసీపీ సురేందర్ ఘటనా స్థలంలో ఆధారాల్ని పరిశీలించారు. ఆమెను ఎక్కడైనా చంపేసి ఇక్కడకు తీసుకొచ్చి కాల్చి పడేశారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. అలాగే స్కూటీకి పంక్చర్ వేసిన షాప్ వద్దకు వెళ్లి.. ప్రియాంక ఏ టైమ్ లో అక్కడకు వచ్చిందో ఆరా తీశారు. పంక్చర్ షాప్ కుర్రాడు చెప్తున్న దాన్ని బట్టి రిపేర్ తర్వాత ఆమె అక్కడి నుంచి బయలుదేరింది. తర్వాత ఏమైందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story