పుట్టినరోజు నాడే బలైన యువతి.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

పుట్టినరోజు నాడే బలైన యువతి.. పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

wgl

వరంగల్ రూరల్ హన్మకొండలో ఓ యువతి తన పుట్టినరోజు నాడే మృగాడి చేతికి చిక్కి బలైపోయింది. గుడికి వెళ్లి, అట్నుంచి స్నేహితుల్ని కలిసి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి.. రాత్రికి విష్ణుప్రియ గార్డెన్స్ సమీపంలో శవంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన తల్లిదండ్రులు షాకైపోయారు. కూతురు కనిపించకుండా పోవడంతో వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తల్లిదండ్రులు.. చివరికి జరిగిన ఘోరాన్ని చూసి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఘటనా స్థలంలో ఆధారాల్ని బట్టి అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.

పోలీసులు విచారణ జరుపుతుండగానే.. తానే అత్యాచారం చేసి హత్యచేసినట్టు వారి ఎదుట లొంగిపోయాడు నిందితుడు. వరంగల్‌ కు చెందిన సాయిగౌడ్‌ అనే యువకుడు సుబేదార్‌ పోలీసుల వద్దకు వచ్చి నేరాన్ని అంగీకరించాడు. యువతిని రేప్‌ చేసి చంపినట్టు అంగీకరించాడు. ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా? లేక స్నేహితులతో కలిసి దుర్మార్గానికి ఒడిగట్టాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలం వద్ద ఆధారాలు చూస్తే.. గ్యాంగ్‌ రేప్‌ అయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడికి, హతురాలికి మధ్య గతంలో పరిచయం ఉందా? లేక.. మద్యం మత్తులో ఆమెపై దారుణానికి ఒడిగట్టాడా అన్న సమాచారం పోలీసులు సేకరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story