టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కారుకు రోడ్డు ప్రమాదం

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు విశాఖపట్నం జిల్లా నక్కపల్లి వద్ద జాతీయరహదారి డివైడర్ ను ఢీకొంది. బైకును తప్పించబోయి.. డ్రైవర్ రహదారి డివైడర్ ను ఢీకొట్టాడు. రాత్రి 10గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి నుంచి శ్రీకాకుళం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. స్వల్పగాయాలతో అచ్చెన్నాయుడు బయటపడ్డారు. ప్రాధమిక చికిత్స అనంతరం ఆయన మరోకారులో శ్రీకాకుళం వెళ్లారు. గతంలో అచ్చెన్నాయుడు సోదరుడు, టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.
ఘటన గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు అచ్చెన్నాయుడుతో ఫోనులో మాట్లాడారు. ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అటు కార్యకర్తలు కూడా ఎవరూ ఆందోళన చెందవద్దని.. చిన్న ప్రమాదమేనని.. తనకు ఎలాంటి గాయాలు లేవని అచ్చెన్నాయుడు తెలిపారు. చేతికి స్వల్ప గాయం అవడంతో కుట్లు పడ్డాయన్నారు. పార్టీ కార్యక్రమాల్లో యధావిధిగా పాల్గొంటున్నట్టు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com