మహిళలు సహకరిస్తే.. హత్యలు జరగవు: నిర్మాత డేనియర్ శరవణ్

సినీ నిర్మాత డేనియల్ శరవణ్ కీచక వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఓ వైపు దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతుంటే డేనియల్ ఇచ్చిన చెత్త సలహాపై మహిళలు, యూత్ మండిపడుతున్నారు. దిశ ఘటనపై స్పందించిన ఆయన.. మహిళలు ప్రయాణించేటప్పుడు కండోమ్‌ను తీసుకెళ్లి, పురుషుల లైంగిక కోరికను అంగీకరించాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో సంబంధిత పోస్టును అతను తొలగించాడు.
18 సంవత్సరాలు నిండిన మహిళలు లైంగిక విద్య పట్ల అవగాహన పెంచుకోవాలి అని తన పోస్టులో పేర్కొన్నాడు. పురుషుల లైంగిక కోరికలను మహిళలు తిరస్కరించకుండ కండోమ్స్‌తో సహకరిస్తే అప్పుడే ఇలాంటి చర్యలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు. అందుకే 18 సంవత్సరాలు నిండిన యువత కండోమ్‌లను ఉపయోగించాలని ఉచిత సలహా ఇచ్చాడు. ఒక వ్యక్తి తన లైంగిక కోరిక నెరవేరినప్పడు మహిళలను చంపాలని అతడు ప్రయత్నించడని అభిప్రాయపడ్డారు.
పురుషులు కేవలం తమ లైంగిక వాంఛను తీర్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడతారని, దీన్ని మహిళ తిరస్కరించడంతో వారిలో ఒకడు చెడు ఆలోచనతో హత్యలకు తెగబడుతున్నాడని డేనియల్ అభిప్రాయపడ్డాడు. ఇలా అతడు చేసిన పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయ్యింది. అతడి పోస్ట్‌పై సెలబ్రిటీలతో సహా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన సలహాలను ఇచ్చే వారికి కూడా ప్రభుత్వం మరణ శిక్ష విధించాలి అంటూ నిరసలు వెల్లువెత్తుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com