రాజీనామా చేసి వంశీ పార్టీ మారాలి: టీడీపీ

రాజీనామా చేసి వంశీ పార్టీ మారాలి: టీడీపీ
X

vamsi

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారాలి అనుకుంటే కచ్చితంగా రాజీనామా చేసి వెళ్లాలి అన్నారు బుచ్చయ్య చౌదరి. వంశీని ప్రత్యేక సభ్యుడిగా ఎలా గుర్తిస్తారని.. స్పీకర్ ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు. మంత్రులు సభలో బూతులు తిడుతుంటే ఆపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ ప్రత్యేక సీటు కోరే అవకాశం స్పీకర్ ఇవ్వకూడదన్నారు బుచ్చయ్య చౌదరి.

వంశీకి దమ్ముంటే ఎందుకు జగన్‌ని కలిశారో వాస్తవం చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప డిమాండ్‌ చేశారు. కేవలం హైదరాబాద్‌లో భూములు కాపాడుకోడానికే తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. ఒకవేళ తాను మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలవరనే భయంతోనే వంశీ తన పదవికి రాజీనామా చేయడం లేదని చినరాజప్ప ఆరోపించారు.

Tags

Next Story