NRC బిల్లుపై మండిపడుతున్న అమెరికా.. బేఖాతరు చేస్తున్న భారత ప్రభుత్వం


భారత పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ బిల్లును తప్పుడు దిశలో తీసుకున్న ప్రమాదకరమైన మలుపుగా అభివర్ణించింది. మత ప్రాతిపదికన బిల్లు పెట్టడం సరికాదని యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం లోక్‌సభలో పాసైన బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే.. హోంమంత్రి అమిత్‌షాతో పాటు కొందరు ముఖ్య నాయకులపై ఆంక్షలు విధించక తప్పదని USCIRF పేర్కొంది. ఐతే.. ఈ మాటల్ని కేంద్ర ప్రభుత్వం తేలిగ్గానే తీసుకుంటోంది. భారత అంతర్గత విషయాల్లో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని పలుమార్లు ఇప్పటికే స్పష్టం చేసినందున USCIRF సూచనల్ని పట్టించుకోబోమని అంటోంది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చేవారిలో ముస్లింలను మినహాయిస్తూ హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్లకు పౌరసత్వం కల్పించడాన్ని అమెరికా ఆక్షేపిస్తోంది. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం సరికాదని ట్విట్టర్‌లో USCIRF పేర్కొంది. ఐతే.. ఇది ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని సభలోనే అమిత్‌షా సోమవారం సభలోనే స్పష్టం చేశారు. పాక్, బంగ్లా, ఆప్ఘాన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటూ 2014 డిసెంబర్ 31లోపు భారత్ వలస వచ్చిన వారికి పౌరసత్వం కల్పించేందుకే ఈ సవరణ అని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

