ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయాలంటూ టీడీపీ ధర్నా

ఉపాధి హామీ పథకం నిధులు విడుదల చేయాలంటూ టీడీపీ ధర్నా చేపట్టింది. కేంద్రం తన వాటా నిధులను విడుదల చేసినా.. రాష్ట్రం వాటిని పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తోంది. పెండింగ్‌లో ఉన్న బిల్లులు తక్షణం క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తోంది. నరేగా నిధుల విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా సచివాలయం ఫైర్‌స్టేషన్ వద్ద చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. ఇదే అంశంపై సభలో చర్చకు పట్టుబడుతోంది టీడీపీ.
నరేగా పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు నెలల తరబడి బిల్లులు పెడింగ్‌లో పెట్టడంపై చంద్రబాబు మండిపడ్డారు. కేంద్రం 1850 కోట్లు మంజూరు చేసినా ఆ నిధుల్ని ఉపాధి హామీ పథకానికి వాడకుండా.. ఇతర అవసరాలకు మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. నరేగా నిధులు పులివెందుల, పుంగనూరు, తంబళ్లపల్లెకే కాదని గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీది ఉన్మాద ప్రభుత్వమంటూ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com