ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహాం

ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహాం
X

ycp-colours

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయటాన్ని తప్పుబట్టింది. ఈ అంశంపై 10 రోజుల్లో పూర్తి వివరాలు అందించాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

కొద్దిరోజులుగా ఏపీలో కలర్స్ పాలిటిక్స్ పై దుమారం చెలరేగుతూనే ఉంది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ జెండా కలర్లు వేయటంపై ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ప్రతిపక్ష టీడీపీ ఎప్పటికప్పుడు ప్రభుత్వ పోకడను తప్పుబడుతూ నిరసన వ్యక్తం చేస్తూ వస్తోంది. అయినా.. గవర్నమెంట్ ఆఫీసులకు పార్టీల రంగుల వేయటంపై కేడర్ వెనక్కి తగ్గలేదు. చివరి ఈ గొడవ కాస్త హైకోర్టుకు చేరటంతో ప్రభుత్వానికి మరోసారి మొట్టికాయలు తప్పలేదు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూజిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.

ప్రభుత్వ ఆఫీసులకు వైసీపీ రంగులు వేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి హైకోర్టు కూడా చివాట్లు పెట్టిందని గుర్తుచేశారు. అయినా ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతుందని విమర్శించారు. అటు సోషల్ మీడియాలో పొలిటికల్ కలర్స్ ఇష్యూపై సెటైర్లు పేలాయి. గవర్నమెంట్ ఆఫీసులతో పాటు జెండా దిమ్మె, చివరికి సమాధులకు కూడా పార్టీ కలర్లు వేశారనే పోస్టింగులు వైరల్ అయ్యాయి.

Tags

Next Story