దేవుని కేంద్రంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు

X
అనంతపు
రం జిల్లా రామగిరి మండలంలో వెలిసిన ముత్యాలమ్మ దేవాలయం కేంద్రంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత 30 ఏళ్లుగా పరిటాల రవీంద్ర మావయ్య ధర్మవరపు కొండన్న ఈ దేవాలయ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. సుమారు నాలుగు వందల కుటుంబాలు ఈ దేవాలయంపై ఆధారపడి ఉన్నాయి. 70 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చింది. దీంతో అక్కడ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ పొట్ట కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తేవొద్దని కోరుతున్నారు. ఇదంతా స్థానిక వైసీపీ నేతల కుట్రేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
