మద్యపాన నిషేధంపై మేము చిత్తశుద్ధితో ఉన్నాం: సీఎం జగన్

ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ తీరుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు నోరు తెరిస్తే అన్ని అబాద్ధాలే చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అచ్చెన్నాయుడు తీరును తప్పు పట్టారు. సభలో ఇన్ని అవాస్తవాలు చెబుతున్న అచ్చెన్నాయుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదన్నారు. అందుకే అతడిపై సభా హక్కుల నోటీసు ఇస్తున్నానని ప్రకటించారు.
టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారిందని జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో పూర్తిగా బెల్ట్ షాపులను తొలగించామని వివరణ ఇచ్చారు. తన పాదయాత్రలో చెప్పినట్టే మందుబాబులకు షాక్ ఇచ్చానని.. రేట్లను సైతం ముందే చెప్పానని గుర్తు చేశారు. మద్యపాన నిషేదంపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హామీ ఇచ్చారు జగన్.
అక్రమంగా మద్యం రవాణ చేసినా.. నిల్వ ఉంచినా వారిని ఉపేక్షించేది లేదన్నారు జగన్. ఆరు నెలలపాటు జైలు శిక్షతో పాటు నాన్ బైల్‌బుల్ కేసులు పెడతామన్నారు. ఇల్లీగల్‌గా వ్యవహించే బార్ ల లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తామని జగన్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com