కేసీఆర్ పథకాలు రైతులకు భరోసా ఇస్తున్నాయి: ఎర్రబెల్లి

కేసీఆర్ పథకాలు రైతులకు భరోసా ఇస్తున్నాయి: ఎర్రబెల్లి
X

errabelli

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు భరోసా ఇస్తున్నాయని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూపాలపల్లి మండలం విజినేపల్లి గ్రామంలో సబ్‌ స్టేషన్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాటారం మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ పాల్గొన్నారు మంత్రి. రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఘటన కేసీఆర్‌కే దక్కుతుందన్నారు ఎర్రబెల్లి. మంత్రి వెంట భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికూడా ఉన్నారు.

Tags

Next Story