రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం: సీఎం జగన్

X
By - TV5 Telugu |17 Dec 2019 7:07 PM IST
ఏపీ రాజధానిపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్‌కు బహుశా 3 రాజధానులు రావచ్చని అన్నారు. అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరమని చెప్పారు. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ పెట్టవచ్చని చెప్పారు. ఏపీలో సౌతాఫ్రికా తరహా మోడల్ అవసరం అన్నారు. సౌతాఫ్రికాకు 3 రాజధానులు ఉన్న అంశాన్ని జగన్ గుర్తు చేశారు. రాజధానిపై వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక వస్తుందని తెలిపారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రకటనతో రాజధానిపై పూర్తి క్లారిటీ ఇచ్చినట్లుగానే భావిస్తున్నామని తెలిపారు సీఎం జగన్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com