జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు: లోకేష్

జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు: లోకేష్
X

lokesh

గతంలో అమరావతికి మద్దతు తెలిపిన జగన్.. అధికారంలోకి రాగానే మాట తప్పి..మడమ తిప్పారని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలన్నదే జగన్ ఎత్తుగడని ఆరోపించారు.రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాజధాని రైతుల ఆందోళనకు మద్దతుగా మంగళగిరిలో నిర్వహించిన కాగడాల ర్యాలీలో లోకేష్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులు, రైతు కూలీలు, ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags

Next Story