బడేటి బుజ్జి మృతితో దిగ్బ్రాంతిలో టీడీపీ వర్గాలు

బడేటి బుజ్జి మృతితో దిగ్బ్రాంతిలో టీడీపీ వర్గాలు
X

bujji

ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి గుండెపోటుతో మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. బుజ్జి మృతిని ఆయన అభిమానులు, ఏలూరు నియోజవర్గ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో కీలక నేతగా ఎదిగారు బడేటి బుజ్జి. 2014 నుంచి 2019 వరకు ఏలూరు ఎమ్మెల్యేగా బడేటి బుజ్జి పని చేశారు. గతంలో మున్సిపల్ వైస్‌ చైర్మన్‌గాను బాధ్యతలు నిర్వహించారు. అయితే 2019 ఎన్నికల్లో రెండో సారి టీడీపీ తరపున బరిలోకి దిగిన బడేటి బుజ్జి.. ఓటమి పాలయ్యారు. సినీ దిగ్గజ నటుడు ఎస్వీ రంగారావుకు బడేటి బుజ్జి మేనల్లుడు. ఏలూరు అభివృద్ధిలో తనదైన ముద్రవేశారు బుజ్జి.

ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. బుజ్జి కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు.. అంతిమ యాత్రలో పాల్గొన్నారు. బుజ్జి మరణం టీడీపీకి తోరని లోటన్నారు. చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌, మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, జవహర్‌, ఇతర ఎమ్మెల్యేలు బుజ్జికి ఘన నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Tags

Next Story