రాజధాని మార్పుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన సుజనా చౌదరి

X

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ప్రజల్లో నెలకొన్న భయాందోళనను కోవింద్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారాయన. మంత్రులు తలోమాట చెప్తూ ప్రజల్లో గందరోగళం సృష్టించారని విమర్శించారు. రాజధాని మార్చడం వల్ల రాష్ట్రమంతటికీ నష్టం కలుగుతుందని సుజనా అన్నారు. ప్రతి జిల్లాలో కియా తరహా కర్మాగారాలు వస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది కానీ.. రాజధానిని తరలించడంతో కాదని హితవు పలికారు. సరైన అధ్యయనం లేకుండా.. తొందరపాటుతో వైజాగ్‌ను ప్రకటించారని సుజనా చౌదరి అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
