28 Dec 2019 3:59 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / సీఎం జగన్ విశాఖ...

సీఎం జగన్ విశాఖ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.. కానీ..

సీఎం జగన్ విశాఖ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.. కానీ..
X

vsp

విశాఖ ఆర్కేబీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్‌కు ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక లేజర్‌షోతో నిర్వాహకులు సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం వేదిక పైకి వచ్చిన జగన్‌ లాంఛనంగా వేడుకలను ప్రారంభించారు. సుబ్బిరామిరెడ్డి సహా పలువురు నాయకులు ఆయన్ను సన్మానించారు. అయితే అనూహ్యంగా జగన్‌ ఏమీ మాట్లాడకుండానే సభ నుంచి వెనుదిరిగారు.

అంతకుముందు విశాఖ ఉత్సవ్‌లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం జగన్‌కు సాగర నగరంలో ఘన స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కైలాసగిరి వరకు దారి పొడవునా 24 కిలో మీటర్ల మేర మానవహారం ఏర్పాటు చేశారు. వెల్‌కమ్‌ బోర్డులు చేత బట్టి ఉత్సాహంగా స్వాగతం పలికారు.

అనంతరం.. కైలాసగిరిపై VMRDA కు చెందిన 380 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కైలాసగిరిపై 56.55 కోట్ల అభివృద్ధి పనులతో పాటు.. 88 కోట్లతో కాపులుప్పాడలో 15 ఎకరాల విస్తీర్ణంలో నేచురల్‌ హిస్టరీ పార్క్‌ అండ్‌ మ్యూజియానికి కూడా శంకుస్థాపన చేశారు. 40 కోట్లతో నిర్మించనున్న బీచ్‌ ఫ్రంట్‌ ఇంటిగ్రేటెడ్‌ మ్యూజియంకు, 37 కోట్లతో కైలాసగిరిపై నిర్మించబోయే ప్లానిటోరియంకు జగన్‌ శంకుస్థాపన చేశారు.

వైఎస్‌ఆర్‌ సెంట్రల్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఫ్లవర్‌ షోను జగన్‌ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన GVMC పరిధిలోని 905 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను తిలకించారు.

Next Story