ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం

us..iran

ఇరాక్‌పై అగ్రరాజ్యం అమెరికా రెండోరోజు కూడా వైమానిక దాడులకు దిగింది. ఉత్తర బాగ్దాద్‌ లోని ఇరాన్ మద్దతుదారులపై అమెరికా రాకెట్లతో దాడులకు పాల్పడింది. ఈ దాడిలో సైన్యానికి చెందిన ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. ఇరాక్‌ మిలీషియా కమాండర్‌ లక్ష్యంగా వైమానికి దాడులు జరిపినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. శుక్రవారం అమెరికా చేసిన దాడిలో ఇరాన్‌ దేశ రివల్యూషనరీ గార్డ్‌ కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమాని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సోలేమాన్ తో పాటు 8మంది మరణించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకే ఈ దాడికి పాల్పడినట్టు పెంటాగన్‌ ప్రకటించింది. అమెరికా దౌత్యకార్యాలయంపై దాడి చేసినందుకే ఇరాక్‌పై దాడికి దిగామంటూ అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు.

ఇరాన్ ఖడ్స్ ఫోర్స్ అధిపతి ఖాసీ పోలేమాన్ ను అమెరికా హతమార్చడంపై ఆ దేశ అధినాయకుడు అయాతోల్లా అలీ ఖమేనీ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. సోలేమాన్ ను అంతం చేసినా.. ఆయన చూపిన బాటలో నడవకుండా ఎవరిని కట్టడి చేయలేరన్నారు. జీహాదీలు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారంటూ ఏర్పాటువాద దాడులకు ఊతమిస్తూ ఆయన మాట్లాడారు. దీంతో ఇరుదేశాల మధ్య పరిస్థితి తీవ్రస్థాయికి చేరింది.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో అమెరికా మరోకీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతానికి 3వేల మంది సైనికులను పంపించేందుకు సిద్దమైంది. నార్త్ కరోలినాలోని 82వ ఎయిర్ బోర్న్ విభాగానికి చెందిన సైనికులను అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇరాక్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై దాడి అనంతరం కువైట్ లోను అమెరికా 7వందల మంది సైనికులను మోహరించింది. ఖాసీం సులేమాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ హెచ్చరించిన నేపధ్యంలో అమెరికా ముందుజాగ్రత్తగా సైన్యాన్ని ఆయాదేశాల్లో మోహరిస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడితే వాటిని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. తాను యుద్దం ప్రారంభించలేదంటూనే అమెరికా సైన్యాన్ని మోహరించడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాగ్దాద్ పై అమెరికా దాడులను రష్యా, చైనా, ప్రాన్స్ దేశాలు ఖండించాయి.

బాగ్దాద్ దాడి అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడటంతో అమెరికా తమ పౌరులకు ఆదేశాలు జారీచేసింది. ఇరాక్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే వెనక్కి తిరిగి రావాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. ఇరాన్‌ మద్దతున్న మిలిటెంట్లు అమెరికా దౌత్యకార్యాలయం దగ్గర జరిపిన దాడులతో ఎంబసీలో కార్యకలాపాలు నిలిపివేశామని, పౌరులెవరూ అక్కడికి వెళ్లవద్దని ట్వీట్టర్ ద్వారా తెలిపింది. పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ద వాతావరణంతో ఆయాదేశాల్లోని అమెరికా పౌరులు స్వదేశం బాటపడుతున్నారు. అయితే ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణంతో అంతర్జాతీయంగా చమురుధరలు పెరుగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story