ఏపీలో మరో 'దిశ' లాంటి దారుణ ఘటన
నెల్లూరు జిల్లాలో 'దిశ' లాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. గూడూరు రూరల్ పరిధిలోని చవటపాలెం ప్రాంతానికి చెందిన పర్వీన్ అనే 23 ఏళ్ల యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై.. అమ్మాయిని కిరాతకంగా హత్య చేశారు. చవటపాలెం గ్రామ సచివాలయం సమీపంలోనే ఈ ఘోరం చోటు చేసుకుంది.
చవటపాలెంలోని ఓ పాడుబడిన భవనంలో పర్వీన్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. మృతదేహంపై దుస్తులు లేకపోవడం.. తలపై రాడ్డుతో కొట్టిన గాయాలు ఉండడంతో.. అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
నెల్లూరు జిల్లా చవటపాలెంలో దిశ తరహా ఘోరం వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి దోస పిండి కోసం బయటకు వెళ్లిన పర్వీన్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో.. కుటుంబసభ్యులు రాత్రంతా వెతికారు. తెలిసినవారి ఇంటికి వెళ్లి ఉంటుందని భావించారు. అదే సమయంలో రాత్రి 7 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఊళ్లో అనుమానాస్పదంగా తిరిగినట్టు స్థానికులు చెప్తున్నారు. వాళ్లే దుర్మార్గానికి పాల్పడి ఉండవచ్చని పోలీసుల విచారణలో తేలింది. ఆ ముగ్గురి కోసం వేట సాగిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com