సొంత పార్టీ కార్యకర్తలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజా
చిత్తూరు జిల్లా కేబీఆర్‌పురంలో తన వాహన శ్రేణిపై దాడి జరిగిన ఘటనపై ఎమ్మెల్యే రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పుత్తూరు పోలీస్ స్టేషన్‌లో తనపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. రోజా ఫిర్యాదుతో 10 మంది వైసీపీ కార్యకర్తలపై పుత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన హరీష్, సంపత్, సురేష్, రిషేంద్ర, అంబు, సరళ, రామ్మూర్తిలపై. 143, 341, 427, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ఆదివారం చిత్తూరు కేబీఆర్‌పురంలో పర్యటించిన రోజాకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ ఎదురైంది. అది కూడా తన సొంత నియోజకవర్గం నగరిలో. కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. రోజా సొంత పార్టీ నేతలనే పట్టించుకోవడం లేదంట ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సర్దిచెప్పలేక ఇబ్బంది పడ్డ రోజా.. విధిలేక వెనుదిరిగి వెళ్లిపోయారు. రోజా ఫిర్యాదుతో.. దాడి చేసిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com