సీఎం గారి చెత్త నిర్ణయాలతో రైతులు బలైపోతున్నారు: లోకేష్

సీఎం గారి చెత్త నిర్ణయాలతో రైతులు బలైపోతున్నారు: లోకేష్

nara-lokesh

రాజధాని మార్పు నిర్ణయంతో ఆందోళనకు గురైన రైతుల గుండెలు ఆగుతున్నా.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ టార్గెట్‌గా ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు. CM గారి చెత్త నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కృపానందం మృతి తనను తీవ్రంగా కలచివేస్తోందన్నారు. రైతులను అవమానిస్తూ, కించపరుస్తూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని.. దానివల్లే రైతులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా మూర్ఖంగా వ్యవహరించకుండా రాజధాని మార్పుపై పునరాలోచించుకోవాలన్నారు.

Tags

Next Story