జగన్ అంత పిరికి వ్యక్తి మరొకరు ఉండరు: చంద్రబాబు

జగన్ అంత పిరికి వ్యక్తి మరొకరు ఉండరు: చంద్రబాబు

chandrababu

ప్రజా రాజధాని కోసం ప్రజా ఉద్యమం ఉధృతమవుతుందన్నారు చంద్రబాబు. విజయవాడలో అమరావతి జేఏసీ నేతల సమావేశం పాల్గొన్న ఆయన వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. న్యాయం కోసం పోరాడుతున్న రైతులు, మహిళలపై వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. జగన్‌ అంత పిరికి వ్యక్తి మరొకరు ఉండరని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చైతన్య యాత్ర ఆగదన్నారు.

సీఎం జగన్‌కు ఇంత అహంభావం ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. రైతులను ఎంత అణగదొక్కితే అంత ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాజధానికి లక్ష కోట్లు కావాలంటూ దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Next Story