ఆంధ్రప్రదేశ్

టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్.. పార్టీ వర్గాలు ఆగ్రహం

టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్.. పార్టీ వర్గాలు ఆగ్రహం
X

avinash

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవినాష్‌ చౌదరి దూళిపాళ్లను మాచర్ల పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం అవినాష్‌ టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తగా ఉన్నాడు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి.. చంద్రబాబుపై అసభ్యకరమైన భాషను ఉపయోగించడాన్ని నిలదీస్తూ.. వీడియో చేసినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అన్యాయాన్ని నిలదీస్తూ వీడియో తీసినందుకు కక్ష కట్టి వైసీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎలాంటి అరెస్ట్‌ వారెంట్ చూపకుండా అవినాష్‌ను జైల్లో పెట్టడమే కాకుండా.. థర్డ్‌ డిగ్రీ కూడా ప్రయోగించడం ఏంటని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. అవినాష్‌ ప్రాణాలకు ముప్పుఉందని అతడి కుటుంభ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Next Story

RELATED STORIES