- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- చంద్రబాబు బస్సు యాత్రకు పెద్దఎత్తున...
చంద్రబాబు బస్సు యాత్రకు పెద్దఎత్తున లభిస్తున్న మద్దతు

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ఏలూరు, ఉంగుటూరు మీదుగా సాగిన చంద్రబాబు యాత్రకు ప్రజలనుంచి మంచి మద్దతు లభించింది. మహిళలు పెద్దయెత్తున తరలివచ్చి బాబు జోలిలో నగదుతో పాటు చేతి బంగారు గాజులనుకూడా వేశారు.
అంతకముందు.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో ప్రత్యేక పూజలు చేశారు చంద్రబాబు. హనుమాన్ ఆలయానికి వెళ్లిన చంద్రబాబు... స్వామివారిని దర్శించుకున్నారు. తాడేపల్లి గూడెం, తణుకు, రావులపాలెం మీదుగా రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్‌కు బస్సు యాత్ర చేరుకోనుంది. మోరంపూడి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వరకు జరిగే పాదయాత్రలో చంద్రబాబు, జేఏసీ నేతలు పాల్గొని.. జోలెపట్టి విరాళాలు సేకరిస్తారు. ఆ తర్వాత కోటిపల్లి బస్టాండ్ దగ్గర జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com