రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయి: నారా లోకేష్

రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయి: నారా లోకేష్

lokesh

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో దీనిపై స్పందించిన లోకేష్‌.. రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయని మండిపడ్డారు. పాకిస్తాన్‌ బోర్డర్‌లో కూడా ఇంతమంది పోలీసులు ఉండరన్న లోకేష్‌.. అన్యాయంగా, క్రూరంగా పోలీస్ బలంతో ఉద్యమాన్ని అణచివేయాలని జగన్‌ చూస్తున్నారంటూ విమర్శించారు. ఎంత అణచివేస్తే ఉద్యమం అంత ఉగ్రరూపం దాలుస్తుందని.. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను రెచ్చగొట్టే చర్యలు వైసీపీ ప్రభుత్వం మానుకోవాలని లోకేష్‌ హెచ్చరించారు.

Tags

Next Story